యువకుడు ఆత్మహత్యాయత్నం
చెళ్లకెరె రూరల్: నన్నివాళ గ్రామానికి చెందిన యువకుడు మహేష్ వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ వెనుక భాగంలో జరిగింది. సగం మేర కాలిన యువకుడిపై ప్రజలు నీరు పోసి మంటలను ఆర్పివేశారు. విషయం తెలుసుకున్న వెంటనే 112 హొయ్సళ వాహనంలో పోలీసులు స్థలానికి వచ్చి యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. స్థలాన్ని సబ్‌ఇన్‌స్పెక్టర్ శివరాజ్, పోలీసులు సంతోష్, చౌహాన్ పరిశీలించారు.


