సావిత్రి బాయి పూలే సేవలు అమూల్యం
హొసపేటె: స్థానిక జీటీ కాంపౌండ్ ప్రాంతంలో ఆదివారం అక్షరాల తల్లి సావిత్రి బాయి పూలే జయంతిని మురికివాడల ప్రజల సంస్థ కర్ణాటక విజయనగర జిల్లా మహిళా విభాగంలో ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ సంఘం సీనియర్ గైడ్ ఉమాదేవి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అన్నారు. మహిళలు చదువుకునే హక్కు పొంది, అక్షరాలు నేర్చుకోవాలనే సదుద్దేశంతో పోరాటం చేశారని తెలిపారు. భర్త జ్యోతిబాపూలే సహకారంతో ఆమె పాఠశాలను స్థాపించినట్లు వెల్లడించారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, విద్యా సంస్థలను స్థాపించడంలో జ్యోతిబాపూలే పాత్ర ముఖ్యమైనదని పేర్కొన్నారు. కార్యక్రమానికి మహిళా విభాగం అధ్యక్షురాలు హులిగెమ్మ అధ్యక్షత వహించారు. జిల్లా కమిటీ అధ్యక్షురాలు హెచ్.శేషు, ఉపాధ్యాక్షురాలు తన్నీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేష్, మాజీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలు జిబేదాబి, షేక్ మెహబూబ్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కై లాస్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ తాజుద్దీన్, బినా రూపలత, జాఫ్రియన్ పద్మలత పాల్గొన్నారు.


