ఏనుగులున్నాయ్.. జాగ్రత్త
కెలమంగలం: కెలమంగలం–రాయకోట రోడ్డులో నాగదోణై వద్ద ఏనుగులు మకాం వేశాయి. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతం నుంచి వలస వచ్చిన ఏనుగులు గుంపులుగా విడిపోయాయి. ప్రస్తుతం జవుళగిరి, డెంకణీకోట, ఉడేగదుర్గం అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. ఇప్పటికే 40 ఏనుగులను అటవీ శాఖ అధికారులు కర్ణాటక వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఉడేదుర్గం అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద కెలమంగలం–రాయకోట రోడ్డులోని నాగదోణి వద్ద అటవీ శాఖకు సంబంధించిన నర్సరీ సమీపంలో మకాం వేశాయి. ఈ ఏనుగులు ఎప్పుడైనా రోడ్డును దాటేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఏనుగుల మందను చూసి సెల్పీలకు ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. కొంత మంది సిబ్బంది ఘటనా స్థలంలో ఏనుగుల సంచారంపై నిఘా పెట్టారు.
ఏనుగులున్నాయ్.. జాగ్రత్త


