రౌడీయిజం చేసినట్లు ఆధారాలు ఉన్నాయా?
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి, గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర రౌడీయిజం చేసిన ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా అని వాల్మీకి నాయకులు ప్రశ్నించారు. శనివారం నగరంలోని నక్షత్ర హోటల్‌లో వాల్మీకి సముదాయ ప్రముఖులు రాంప్రసాద్, జగన్, పరిశురాం, (పరిశీ) మల్లికార్జున తదితరులు విలేకరులతో మాట్లాడారు. తమ సమాజానికి చెందిన ఎమ్మెల్యే నాగేంద్ర రౌడీయిజం చేశారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి మాట్లాడటంలో అర్థం లేదన్నారు. నాగేంద్ర రౌడీయిజం చేసినట్లు ఏమైనా మీదగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తమ సమాజానికి చెందిన శ్రీరాములు, నాగేంద్ర, సురేష్ బాబును రాజకీయంగా అణదొక్కాలని ప్రయత్నించడం సరికాదన్నారు. మూడు నెలలు క్రితం శ్రీరాములును కూడా మీరు విమర్శించ లేదా అని ప్రశ్నించారు. మా నాయకుడు నాగేంద్ర మీతో గౌరవంగా మాట్లాడారని.. అయితే మీరు నాగేంద్రను విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. శ్రీరాములును తమ లీడర్‌గా ఒప్పుకున్నామని.. కులాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని హితవు పలికారు. ధూళుతో పోల్చడం ఎంతవరకు సమంజసమన్నారు. అదే ధూళు మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించారని.. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సమాజ ప్రముఖులు ముద్దు మల్లికార్జున, వండ్రప్ప, శిరనాథ్, నరేంద్ర, ఎల్.మారెన్న, గోవిందు, సోమణ్ణ తదితరులు పాల్గొన్నారు.


