నేటి నుంచి అంబామఠం జాతర
రాయచూరు రూరల్: జనవరి 3 నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలోని సింధనూరు తాలూకా అంబామఠంలో అంబాదేవి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సింధనూరులో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన అంబాదేవి జాతర మహోత్సవాలను సాయంత్రం 5 గంటలకు ముఖ్య అతిథులు ప్రారంభిస్తారు. జానపద జాతర, నృత్యం, హాస్య సంజె, దేవి పల్లకీ సేవలు, నాటకాలు, కుంభోత్సవాలు జరుగుతాయి. సింధనూరు తాలూకాలో సిద్ద పర్వతంగా పేరొందిన అంబా మఠం చరిత్ర మరువరానిది.
అవధూతకు బాల్యంలోనే దేవి దర్శనం
1857లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పెద్ద హరివాణంలో జన్మించిన చిదానంద అవధూత బాల్యంలోనే దేవి దర్శనం పొందారు. పేదరికంలో మగ్గుతున్న చిదానందకు ఊరి బయట ఇంటిలో దెయ్యం ఉందని గ్రామ పెద్ద గౌడ చెప్పడంతో అదే నివాసంలో చిదానంద కుటుంబ సభ్యులు నివాసం ఉన్నారు. ఇంటి దేవుడు వీర నారాయణకు పూజలు చేసే ముందు నైవేద్యం తీసుకెళ్లి పూజలు చేసే వరకు భోజనం చేయరాదని తండ్రి చిదానందను ఆజ్ఞాపిస్తూ స్తంభానికి కట్టేసి ఆలయానికి వెళ్లిపోతారు. దేవి ప్రత్యక్షమై కట్టలను విప్పి చిదానందతో భోజనం చేయిస్తుంది. తల్లిదండ్రులు చిదానందకు చీవాట్లు పెడతారు. దేవి చేసిన మేలుకు తోడు నివాసంలో దెయ్యం కాదు, తానే వెలశానని చెప్పి మాయమైంది. ఉత్సవాల్లో సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, తహసీల్దార్ అరుణ్ దేశాయి, టీపీ ఈఓ చంద్రశేఖర్, ఖాజీ, మాలిక్‌లు పాల్గొంటారు.
నేటి నుంచి అంబామఠం జాతర


