‘గాలి’ ఇంటి వద్ద బ్యానర్ వేయలేదు
సాక్షి,బళ్లారి: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన ఇంటి వద్ద తమ కార్యకర్తలు బ్యానర్ వేయలేదని, రోడ్డుపైన వేస్తే తప్పేమిటని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నరేళ్లలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. వాల్మీకి పేరు చెప్పుకుని రాజకీయాల్లో ముందుకు వచ్చిన వీరు వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే అడ్డుకునే కుట్ర చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా త్వరలో ఘనంగా వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామన్నారు.
రోడ్డుపై మాత్రమే వేశారు
ద్వేష రాజకీయాలకు యువకుడు బలి
నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ధ్వజం
మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖరరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం నుంచి, తన వ్యక్తిగతంగా కూడా సాయం చేస్తామన్నారు. మహర్షి వాల్మీకిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నానికి, వారు వేయి రెట్లు తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. తుచ్ఛమైన, నీచమైన రాజకీయాలు చేస్తుండటంతో తన రక్తం ఉడికిపోతోందన్నారు. తాను యువకుడినైనా శాంతియుతంగా ఉన్నానని, లేకపోతే వారేం తనకు లెక్కకాదన్నారు. తమ వద్ద కూడా అన్ని విధాలుగా శక్తి ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిభ భద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుల్లెట్ తగిలి తగిన తమ పార్టీకి చెందిన యువకుడు మృతి చెందడంతో చాలా బాధ కలుగుతోందన్నారు. ఈ కుట్రలు చేసిన వారి కథ చూస్తానని హెచ్చరించారు.


