మా పార్టీకి చెడ్డ పేరు తేవాలనే కుట్ర
బళ్లారిటౌన్: నగరంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే భరత్‌రెడ్డికి చెడ్డ పేరు తేవాలనే బీజేపీ నేత గాలి జనార్ధన్‌రెడ్డి కుట్ర పన్నారని బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర ఆరోపించారు. శుక్రవారం స్థానిక ఓ హోటల్‌లో సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గణేష్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనలో తమ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కోల్పోయామన్నారు. ప్రాణ త్యాగం చేసిన కార్యకర్తల విలువ కట్టలేమన్నారు. జనార్ధన్‌రెడ్డి తన వయస్సుకు తగట్టుగా నడుచుకోవాలన్నారు. ఇటీవల రాజకీయాల్లో గుర్తింపు పొందుతున్న నారా భరత్‌రెడ్డిపై లేని పోని ఆరోపణలు చేయడం, ఆయన తండ్రి సూర్యనారాయణరెడ్డిపై కూడా ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. ముండ్రగి నాగరాజు, మానయ్య తదితర నేతలు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి
కృషి చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత ముందుండాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. శుక్రవారం బెంగళూరులో ఖర్గే రాయచూరు జిల్లా వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు మారెప్పను సన్మానించి మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
మా పార్టీకి చెడ్డ పేరు తేవాలనే కుట్ర


