జిల్లాకు ఎత్తినహొళె నీరు
కోలారు: ఏడాదిన్నరలోగా కోలారు జిల్లాకు ఎత్తినహొళె నీటిని అందిస్తామని రాష్ట్ర సౌరసరఫరాల శాఖా మంత్రి కెహెచ్ మునియప్ప తెలిపారు. గురువారం తన నివాసంలో విలేకరుల సమవేశంలో మాట్లాడారు. దేవనహళ్లి సమీపంలోని కుందాణ వద్ద నీటిని సంగ్రహించి మూడు లైన్‌ల ద్వారా నీటిని కోలారు, చిక్కబళ్లాపురం, బెంగుళూరు రూరల్ జిల్లాలకు సరఫరా అవుతుందన్నారు. బెంగుళూరులోని కోగిలు కాలనీలో బాధితులకు ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందన్నారు. సిరిధాన్యాల కిట్‌ల వల్ల 4.5 కోట్ల మంది రేషన్ కార్డులు కలిగిన వారు లబ్ధి కలుగుతోందన్నారు. శ్రీనివాసపురం వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1200 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అయితే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమణ్ణ దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు.


