ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జలోత్సవంలో రాయల ఊరేగింపు
రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడిన భక్తులు
మూల విరాట్‌కు పూజలు చేస్తున్న శ్రీపాదంగళ్
బీఎంసీఆర్‌సీలో న్యూఇయర్ సందడి
బళ్లారి రూరల్: బీఎంసీఆర్‌సీలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పరిపాలనా భవన్‌లో డీన్ డాక్టర్ గంగాధర గౌడ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అధికారులు, సిబ్బంది, ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో దంత వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి, వైద్యులు, డాక్టర్ బసవరాజు, డాక్టర్ ధనుజ, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ నయన, డాక్టర్ గీత, డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రచన, డాక్టర్ పూర్ణిమ, బీఎంసీఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు. కొళగల్లు రైతు పూజారి దొడ్డబసప్ప మంత్రాలయంలో మాదిరిగా రోగులకు తనవంతు సేవలందిస్తున్నారు. గత మూడు నెలలుగా ప్రతి గురువారం 200 మందికి పాయిసం, అన్నం, సాంబారు, రసంతో కూడిన అన్న సంతర్పణ చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా యువకులు తిప్పేస్వామి, డొడ్డబసప్ప, సోమప్ప, సన్నరద్రప్పతో కలసి బీఎంసీఆర్‌సీ ఆవరణలో రోగులు, వారి బంధువులకు అన్నదానం చేశారు.
హొసపేటె: విజయనగర జిల్లా వ్యాప్తంగా గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. మహిళలు ఇళ్ల మందు న్యూఇయర్ ముగ్గులు వేసి సందడి చేశారు. సమీపంలోని దేవాలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలో అమరావతిలో వెలసిన వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అంతకుముందు వేంకటేశ్వరుడిని అర్చకుడు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో పూలమాలలతో విశేషంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అదే విధంగా పాఠశాలల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మంత్రాలయంలో భక్తుల కోలాహలం
రాయచూరు రూరల్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకొంది. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలో బారులుదీరారు. రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీ పాదంగల్ ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు మఠం భవనాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆన్‌లైన్ బుకింగ్‌లో కూడా గదులు లభించక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. హోటళ్లు, దుకాణాల్లో వ్యాపారం జోరందుకుంది.
హుబ్లీ: జంట నగరాల్లోని వివిధ ప్రార్థన మందిరాల్లో బుధవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. 12 గంటలకు కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ధార్వాడ కళ్యాణ నగర శ్రీ శారద వృద్ధాశ్రమంలో భక్తి గీతాలు ఆలపించారు. చిత్రదుర్గ సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా డీడీ విజయ్ కుమార్, సంబంధిత కార్యాలయ సిబ్బందితో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో అధికారి గంగప్ప, ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పోలీసులు పర్యవేక్షించారు.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు


