నూతన ఎస్పీల నియామకం
సాక్షి బళ్లారి: జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శోభారాణి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నియమితులైన పవన్ నెజ్జూర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. నగరంలోని ఎస్‌పీ కార్యాలయంలో పలువురు పోలీసు అధికారులు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అంతకుముందు బళ్లారి నుంచి బదిలీ అయిన ఎస్పీ శోభారాణికి వీడ్కోలు పలికారు. ఎస్‌పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్‌పీ రవికుమార్, డీవైఎస్‌పీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల నుంచి వచ్చిన పోలీసు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏడాదిన్నర నుంచి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నూతన ఎస్‌పీగా బాధ్యతలు తీసుకున్న పవన్ నెజ్జూర్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతలు పర్యవేక్షణ, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఎస్పీగా అరుణాంగుష్ గిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పుట్ట మాదయ్యను కలబుర్గి పోలీస్ శిక్షణ కేంద్రంలో డీఐజీగా నియమించింది. ఇక బెళగావి ఎస్పీగా ఉన్న బీమా శంకర్ గుళేదగుడ్డను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎస్పీగా రామరాజన్‌ను నియమించారు.
నూతన ఎస్పీల నియామకం
నూతన ఎస్పీల నియామకం
నూతన ఎస్పీల నియామకం


