కన్నడను ప్రోత్సహించాలి
రాయచూరు రూరల్: గడినాడు ప్రాంతంలో కన్నడ భాషను ప్రోత్సహిచాలని బెంగళూరు ఆకాశవాణి కళాకారుడు యోగ రవీశ బారత పిలుపు ఇచ్చారు. నగరంలోని క్రైస్ట్ అకాడమీ, ఐసీఎస్‌సీ ఆధ్వర్యంలో జరిగిన 70వ కన్నడ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇతర భాషల నుంచి కన్నడ భాషకు గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. అన్య భాషలను గౌరవిస్తూ కన్నడకు పెద్ద పీట వేయాలన్నారు. 1980లో కన్నడ భాషకు బదులుగా అన్య భాషల ప్రభావం అధికంగా ఉందన్నారు. కన్నడ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆందోళన చేశారని గుర్తు చేశారు. థామస్, సెబాిస్టియన్‌లున్నారు.


