కొట్టూరేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
హొసపేటె: కలియుగ కామధేనువు, కల్పవృక్షంగా భక్తుల విశ్వాసాన్ని పొందిన కొట్టూరు శ్రీ గురు బసవేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లాధికారిణి కవిత మన్నికేరి సందర్శించి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఆలయం చుట్టూ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడుతూ రథోత్సవ సమయంలో వేలాది మంది భక్తులు కాలినడకన కొట్టూరుకు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి, పరిశుభ్రత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. పాత పట్టణ పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రెండవ దశ పనులకు త్వరలో నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యనిర్వహక అధికారి మల్లప్ప, తహసీల్దార్ అమరేష్, పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి ఏ.నసురుల్లా, ప్రధాన ధర్మకర్త శేఖరయ్య, బీడీసీసీ బ్యాంక్ జిల్లా గ్రామ ఉపాధ్యక్షుడు అడకి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.


