ప్రైవేటుకు దీటుగా.. ఆధునికత తోడుగా
అన్ని రకాల ప్రయోగాలతో ఏర్పాటు చేసిన ప్రయోగశాల
పచ్చదనం పరిఢవిల్లుతున్న పాఠశాల ఆవరణ
ఆధునిక వసతులతో విద్యార్థులకు పాఠాల బోధన
హొసపేటె: ప్రైవేట్ పాఠశాలల జోరు మధ్య కూడా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించడం కష్టతరమైన నేటి పోటీ యుగంలో విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని 76 వెంకటాపుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా దూసుకుపోతోంది. 1995లో ప్రారంభమైన తాలూకాలోని 76 వెంకటాపుర క్యాంప్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషి, ఎస్‌డీఎంసీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాలో అగ్రగామి పాఠశాలగా రూపుదిద్దుకుంది. గత 17 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, గత 12 సంవత్సరాలుగా ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న పీజే నిరంజన్ ఈ పాఠశాల అభివృద్ధిలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు.
రాష్ట్రంలో మొట్టమొదటి ప్రయోగశాల
ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శాశ్వత సంస్థ సహకారంతో ఈ పాఠశాలలో మొత్తం రూ.16 లక్షల ఖర్చుతో ల్యాప్ లెర్నింగ్ లాబొరేటరీ, యాక్టివిటీ రూం నిర్మించారు. ఇలాంటి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు కావడం రాష్ట్రంలోనే ఇదే మొదటిది అని సమాచారం. ఈ ప్రయోగశాలలో కన్నడ, ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్‌తో సహా ప్రతి సబ్టెక్టుకు ప్రత్యేక విభాగం సృష్టించారు. ఇక్కడ అక్షరాస్యతతో పాటు సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్‌ను ప్రదర్శనల ద్వారా బోధిస్తారు. 1వ తరగతి నుంచి కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నారు.
76 వెంకటాపుర క్యాంప్‌లో
అత్యాధునిక వసతులతో సర్కారు బడి
అన్ని సబ్జెక్టులను మేళవించేలా
ప్రయోగశాల ఏర్పాటు
ఇలాంటి పాఠశాల ప్రారంభించడం రాష్ట్రంలోనే ప్రథమం
ప్రైవేటుకు దీటుగా.. ఆధునికత తోడుగా
ప్రైవేటుకు దీటుగా.. ఆధునికత తోడుగా
ప్రైవేటుకు దీటుగా.. ఆధునికత తోడుగా


