రైతు సమస్యలపై బెళగావికి కదం
సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో పాటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని బీజేపీ రైతు మోర్చా పదాధికారులు, రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో బళ్లారి జిల్లా నుంచి జిల్లా బీజేపీ రైతు మోర్చా అధ్యక్షుడు గణపాల ఐనాధరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. క్వింటాల్‌కు రూ.2400ల ధర నిర్ణయించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తుంగభద్ర ఆయకట్టు కింద రెండో పంటకు నీరు ఇవ్వాలని లేకుంటే ప్రతి ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కారు. రైతుల సమస్యలపై తాము ఎన్నిసార్లు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తుంగభద్ర ఆయకట్టులో
రెండో పంటకు నీరివ్వాలి
లేదా ఎకరాకు రూ.25 వేల
పరిహారం ఇవ్వాలి
అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు, రైతుల యత్నం
కాంగ్రెస్ సర్కార్‌పై విపక్ష నేత బీ.వై.విజయేంద్ర మండిపాటు
జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు
గణపాల ఐనాధరెడ్డి వెల్లడి
రైతు సమస్యలపై బెళగావికి కదం


