
క్రీడలతో మానసిక ఆరోగ్యం
హొసపేటె: క్రీడలతో మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ప్రాథమిక దశలో విద్యార్థులకు క్రీడాపోటీలు ఎంతో అవసరమని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు నింగప్ప పేర్కొన్నారు. గురువారం తాలూకాలోని మురార్జీ రెసిడెన్సీ పాఠశాల ఆవరణలో క్లస్టర్, డివిజన్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెడ్పీ కురుగోడు తాలూకా పంచాయతీ పాఠశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. అథ్లెటిక్స్ 100, 200, 400, 600 మీటర్ల పరుగు పోటీలు హై జంప్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్, రిలేగేమ్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, చెస్ తదితర పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోషకులు పిల్లల్లో అభిరుచి, ఆసక్తులను గమినించి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలని తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. 20 పాఠశాలల నుంచి 1000 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో తాలూకా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుండప్ప నవర నాగరాజు, తాలూకా సంఘం పదాధికారులు తుకారాం గొరవ, సన్నమారెప్ప, శివశంకర్, ఉపాధ్యక్షుడు గవిసిద్ధ్దప్ప, విరుపాక్షయ్య, తదితరులు పాల్గొన్నారు.