
జై కొడతాం బొజ్జ గణేశా
న్యూస్‌రీల్
గుట్కా వ్యసనం.. బాలుని ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: నిషేధిత గుట్కా ఉత్పత్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. గుట్కా తినవద్దు, ఆరోగ్యం పాడవుతుంది అని అవ్వ తన మనవడిని మందలించగా, అతడు అలిగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలబుర్గి జిల్లా అఫ్జలపుర తాలూకా కర్జగి గ్రామంలో జరిగింది. రోహిత్ (14) 9వ తరగతి చదువుతున్నాడు. రోజూ గుట్కా నములుతుండడంతో గమనించిన అవ్వ దమయంతి.. అది మంచిది కాదని, ఆరోగ్యం చెడిపోతుందని దండించింది. ఈ మాటలతో చిన్నబుచ్చుకున్న రోహిత్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అఫ్జల్‌పుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఫ్లై ఓవర్ నుంచి కిందపడి మహిళ మృతి
దొడ్డబళ్లాపురం: రాంగ్ రూట్‌లో వచ్చిన కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన దేవనహళ్లి దగ్గర బచ్చళ్లి గేట్ వద్ద చోటుచేసుకుంది. బాణసవాడికి చెందిన నేత్రావతి (31) మృతురాలు. శనివారం రాత్రి భర్తతో కలిసి బైక్‌పై బెంగళూరు నుంచి చిక్కబళ్లాపురానికి వెళ్తుండగా బచ్చళ్లి గేట్ ఫ్లై ఓవర్‌పైన రాంగ్ రూట్‌లో వచ్చిన కారు వేగంగా ఢీకొంది. ఈ ధాటికి నేత్రావతి వంతెన మీద నుంచి కిందకు పడిపోయింది. తీవ్ర గాయాలపాలై మరణించింది. ఆమె భర్త కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ కారుతో పాటు పరారయ్యాడు. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నేపాలీ బాలింత ఆత్మహత్య
● లాల్‌బాగ్ చెరువులో శవం
బనశంకరి: బెంగళూరు లాల్‌బాగ్ చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు నేపాల్ కు చెందిన జేనిషా (26) అని గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం 6.30 సమయంలో లాల్‌బాగ్ చెరువులో మృతదేహం కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది సిద్దాపుర పోలీసులకు సమాచారం అందించారు.
ఫిర్యాదు చేయడానికి వెళ్లగా
జేనీషా భర్తతో కలిసి సర్జాపురలో నివాసం ఉంటూ కూలిపనులు చేసుకునేవారు. 17వ తేదీన వాణివిలాస ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు బరువు లేదని, ఆరోగ్యం సరిగాలేదని వైద్యులు తెలిపారు. దీంతో జేనీషా కుంగిపోయి ఎటో వెళ్లిపోయింది. భార్య మిస్సయిందని శనివారం మధ్యాహ్నం భర్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు, ఈ సమయంలో లాల్‌బాగ్ చెరువులో లభించిన మహిళ శవం ఫోటోలను చూపించగా భర్త గుర్తుపట్టాడు. శిశువుకు ఆరోగ్యం బాగా లేదని విరక్తి చెంది జేనీషా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని చెరువుకు నడిచి వచ్చిందని భావిస్తున్నారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా విచారణ చేపట్టారు.

జై కొడతాం బొజ్జ గణేశా