
మైసూరు దసరాను ఆమె ఆరంభిస్తారా?
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ మైసూరు దసరా సంబరాల ప్రారంభోత్సవ అతిథిగా కన్నడ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత బాను ముష్తాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం తగదని మైసూరు బీజేపీ మాజీ ఎంపీ ప్రతాపసింహ విమర్శించారు. ఆదివారం మైసూరులో ఆయన మాట్లాడారు. నాడిన శక్తి దేవత, ఆదిదేవత అయిన చాముండేశ్వరిని పూజించి దసరా ఉత్సవాలకు నాంది పలకడం ఆనవాయితీ అన్నారు. రచయిత్రి బానుముష్తాక్ కు చాముండేశ్వరి అమ్మవారిపైన నమ్మకం ఉన్నదా అని ఆయన ప్రశ్నించారు. నేను చాముండేశ్వరి భక్తురాలిని అని చెప్పుకున్నారా? అని అన్నారు. దసరా వేడుకల ప్రారంభానికి ఆమె ఎలా సరైన వ్యక్తి అనుకున్నారని సర్కారుపై మండిపడ్డారు. మత ఆచారాలను వ్యతిరేకించే వారితో మైసూరు దసరా వేడుకలను ఎలా ప్రారంభిస్తారని ధ్వజమెత్తారు. ప్రముఖ నటుడు రిషబ్ శెట్టికి కూడా జాతీయ అవార్డు వచ్చింది, ఆయనను పిలిచారా అని ఎద్దేవా చేశారు.

మైసూరు దసరాను ఆమె ఆరంభిస్తారా?