అయ్య బాబోయ్‌..ఆర్థిక పరిస్థితి! | - | Sakshi
Sakshi News home page

అయ్య బాబోయ్‌..ఆర్థిక పరిస్థితి!

Aug 22 2025 3:15 AM | Updated on Aug 22 2025 3:15 AM

అయ్య

అయ్య బాబోయ్‌..ఆర్థిక పరిస్థితి!

సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అప్పుల భారం పెరిగిపోతున్నా కొత్త రుణాల కోసం వెంపర్లాడుతోంది. ఫలితంగా ఆర్థికంగా సంక్లిష్ట స్థితిలో చిక్కుకున్నట్లు కేంద్ర ఆర్థిక గణాంకాల సంస్థ కాగ్‌ వెల్లడించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీ పథకాల ద్వారా ఆర్థిక వనరులకు కొరత ఏర్పడుతోందని కాగ్‌ తెలిపింది. కాగ్‌ నివేదికతో రాష్ట్ర ఖజానా పరిస్థితిపై తీవ్ర చర్చకు తెరలేసింది. ఆర్థిక అస్థిరత, పలు లోపాలను కాగ్‌ నొక్కిచెప్పింది. ఐదు గ్యారెంటీ పథకాలు.. ఆర్థిక ఆరోగ్యం మీద పెనుభారం మోపుతున్నాయని హెచ్చరించింది. కాగ్‌ నివేదిక మీద అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ నేతలు విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిచయం చేశారు.

పెరుగుతోన్న రెవెన్యూ లోటు

2023–24 ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఖర్చు 15 శాతంగా ఉండగా, అది ఏటికేడాది పెరుగుతూ పోతోందని కాగ్‌ తెలిపింది. రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం గతేడాది కంటే 1.86 శాతం పెరిగితే, ఖర్చులు మాత్రం 12.64 శాతం హెచ్చాయని కాగ్‌ తెలిపింది. తద్వారా రాష్ట్రం ప్రస్తుతం రూ. 9,271 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పథకాల అమలు, వాటి వల్ల కలిగే ఆర్థిక భారాన్ని భరించేందుకకు బహిరంగ మార్కెట్లో రూ. 63 వేల కోట్ల మేర అప్పులను తీసుకుంది. ఇది గతేడాది నికర రుణం కంటే 26 వేల కోట్లు అధికం కావడం గమనార్హం. మున్ముందు ఈ అప్పుల భారానికి తోడు వడ్డీలు కూడా పెరిగి భరించలేని మోతగా మారనుంది. గ్యారెంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాల కోసం ఏటా రూ. లక్ష కోట్లను ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బుధవారమే చెప్పడం తెలిసిందే. కాగ్‌ నివేదికపై ప్రభుత్వం మౌనాన్ని పాటిస్తోంది.

అప్పుల భారం, దివాళా: బీజేపీ

రాష్ట్ర మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన పెట్టుబడులను గ్యారెంటీ పథకాలకు బదలాయించడం వల్ల ఆర్థిక గందరగోళం ఏర్పడుతోందని బీజేపీ ఆరోపించింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాగ్‌ హెచ్చరిక రాష్ట్రానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక ఏడాదిలో మౌలిక వసతుల కల్పన కింద పెట్టుబడుల ఖర్చులో సుమారు రూ 5,299 కోట్లను గ్యారెంటీ పథకాలకు బదలాయించడాన్ని కాగ్‌ తప్పు పట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సమతుల్యత లేని ఆర్థిక నిర్వహణ వల్ల అప్పుల భారం పెరిగి రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. కానీ సీఎం సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంపై విపరీతంగా రుణ భారం

ఎడాపెడా అప్పులు చేస్తున్న సర్కారు

సిద్దు ప్రభుత్వానికి కాగ్‌ మొట్టికాయలు

అయ్య బాబోయ్‌..ఆర్థిక పరిస్థితి!1
1/2

అయ్య బాబోయ్‌..ఆర్థిక పరిస్థితి!

అయ్య బాబోయ్‌..ఆర్థిక పరిస్థితి!2
2/2

అయ్య బాబోయ్‌..ఆర్థిక పరిస్థితి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement