
డిమాండ్లు పరిష్కరించరూ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షుడు అయ్యాళప్ప డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఆందోళన చేపట్టి మాట్లాడారు. వేతనం, అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించక పోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి పెంచి ఆశా కార్యకర్తలకు పెంచక పోవడాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేలు పింఛను చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.