రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో మూడు గంటల పాటు నిరంతర వర్షాలు కురిశాయి. గురువారం జడి వాన కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు బురదమయంగా మారాయి. కురిసిన వానలకు రంగ మందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూరగాయల మార్కెట్ బురదమయం కావడంతో పాటు నీరు చేరడంతో కాయగూరలు తడిసి పోయాయి. విద్యా భారతి రైల్వే వంతెన కింద వాన నీరు నిలబడడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. విజయపురలో రాత్రి భారీ వర్షం కురువడంతో దేవర హిప్పరిగి తాలూకా యళవాడ వద్ద వాగు వంతెనపై భారీగా నీరు ప్రవహించగా టెంపో వ్యాను కూడా వరద నీటిలో వాగును దాటడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.
బురదమయంగా రోడ్లు
చెట్లు కూలి విద్యుత్ కోత
నిరంతర వర్షాలు.. తప్పని తిప్పలు
నిరంతర వర్షాలు.. తప్పని తిప్పలు