
తవ్వకాలలో అస్థికలు
బనశంకరి: పవిత్ర పుణ్యక్షేత్రంలో నేర పరిశోధన సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. అడవులు, నది తీరాలు, చిత్తడి ప్రదేశాలలో పోలీసులు, జాగిలాలతో గాలింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ధర్మస్థలలో మహిళల శవాల పూడ్చివేతల కేసులో సిట్ అధికారులు, స్థానిక పోలీసులు గురువారం కూడా గాలింపు చేపట్టారు.
పాక్షికంగా లభ్యం
ఫిర్యాదిదారు సూచించిన 6వ పాయింట్‌లో రెండు అస్తిపంజరాలు లభించాయి. వాటిలో కొన్నిభాగాలు మాత్రమే ఉన్నాయి. గత మూడు రోజుల నుంచి కళేబరాల కోసం కూలీ కార్మికులు జేసీబీ యంత్రాలతో తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఎలాంటి ఎముకలు లభించలేదు. ఇంక ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో గురువారం పరిస్థితి మారింది. 6వ పాయింట్‌లో 15 మంది కార్మికులతో తవ్వుతుండగా రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పురుషుల ఎముకలుగా గుర్తించారు. అవి కూడా కొన్ని భాగాలే లభించాయి. తరువాత 7, 8 పాయింట్లలో గాలించగా అదే మాదిరి పురుషుని పుర్రె, ఎముకలు బయటపడ్డాయి.
13వ పాయింట్‌పై చూపు
బుధవారం సాయంత్రం వరకు పాయింట్ 1 నుంచి 5 వరకు నాలుగైదు అడుగుల లోతున తవ్వగా ఎలాంటి కళేబరాల జాడ లేదు. ఇప్పుడు 13వ పాయింటుపై అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ అనేక శవాలను పూడ్చిపెట్టినట్లు ఫిర్యాదిదారు చెబుతున్నాడు. ఈ పాయింట్ నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఉండగా, శుక్రవారం తవ్వకాలు జరిపే అవకాశం ఉంది.
ఏమిటీ కేసు?
నేత్రావతి ఘాట్ వద్ద అటవీ ప్రదేశంలో 1998 నుంచి 2014 వరకు వందలాది మహిళలు, పిల్లలు శవాలను పూడ్చిపెట్టానని ఫిర్యాదిదారు చెబుతున్నాడు. తాను అప్పుడు పారిశుధ్య కార్మికునిగా పనిచేశానని తెలిపాడు. అత్యాచారం చేసి హత్య చేశారని పేర్కొన్నాడు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. అన్ని పాయింట్లలో 24 గంటలూ పోలీసు భద్రతను కల్పించారు. ఎటుచూసినా పోలీసు వాహనాలే కనిపిస్తున్నాయి.
6, 7, 8 పాయింట్లలో పురుషుల ఎముకలు లభ్యం
ధర్మస్థలలో కళేబరాల కేసు..
ముమ్మరంగా సాగుతున్న తవ్వకాలు
ఎవరివి అనేదానిపై ఉత్కంఠ
సత్యం బయటపడాలి:
హోంమంత్రి
యశవంతపుర: ధర్మస్థలలో విచారణ సాగిస్తున్న సిట్ చీఫ్, ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతిని కేంద్ర సర్వీసుకు పంపడం గురించి ఇంకా పరిశీలించలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొందరూ ఐపీఎస్‌లను డిప్యుటేషన్ చేయగా ఆ జాబితాలో మొహంతి పేరు ఉంది. కేంద్ర సర్వీసుకు పండంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ధర్మస్థలలో ఏం జరిగిందనే సత్యాన్ని బహిరంగం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు.
ల్యాబ్ పరీక్షలకు తరలింపు
6, 7, 8 పాయింట్లలో సాయంత్రం వరకు లోతుగా తవ్వి అవశేషాల కోసం మట్టిని బయటికి తీశారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రతి ఎముకను పరిశీలించి నంబరు రాసి బ్యాగులో వేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపిస్తారు. ఎవరివి, ఎలా చనిపోయారు అనే వివరాలు సేకరిస్తారు. ఘటనా స్థలానికి సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి చేరుకుని సమాచారం సేకరించారు. సిట్‌కు మరో 9 మంది పోలీసులను డీజీపీ ఎంఏ.సలీం నియమించారు. దక్షిణ జిల్లాలో వివిధ ఠాణాలకు చెందిన ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు ఇందులో ఉన్నారు.

తవ్వకాలలో అస్థికలు

తవ్వకాలలో అస్థికలు

తవ్వకాలలో అస్థికలు