శాంతిభద్రతలు లేవు: విపక్ష నేత
ఈ దుర్ఘటనపై బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేదానికి ఇదే నిదర్శనం అని ట్వీట్ చేశారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. హోంమంత్రి పరమేశ్వర్.. మీ శాఖ మేలుకోవడానికి ఇంకా ఎంతమంది బలి కావాలి, ఇలాంటి దుర్ఘటనలు ఇంకా ఎన్ని జరగాలి అని ఆయన దుయ్యబట్టారు. మైకు దొరికితే చాలు జాతీయ అంతర్జాతీయ , ప్రపంచంలోని అన్ని విషయాలపై ఉపదేశంచేసే మహామేధావి, కలబుర్గి జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి ప్రియాంక్‌ఖర్గేకు తమ జిల్లాల్లో సంభవిస్తున్న రైతుల ఆత్మహత్యలు కనబడటంలేదా అని ప్రశ్నించారు.
బనశంకరి: సిలికాన్ సిటీలో ఘోరం సంభవించింది. బాలుడు ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. దీంతో బాలుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘోరం రాజధాని అంతటా తీవ్ర సంచలనం కలిగించింది. బుధవారం రాత్రి కిడ్నాపైతే గురువారం రాత్రి మృతదేహం లభించింది. ఆ తర్వాత నేరస్తులపై కాల్పులు జరిగాయి.
డ్రైవరే కుట్ర చేసి..
● అరకెరె శాంతినికేతన్ లేఔట్‌లో బాలుడు నిశ్చిత్ (13) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. క్రైస్ట్ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్నాడు.
● నిశ్చిత్ తండ్రి అచ్యుత్ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అచ్యుత్ వద్ద గురుమూర్తి అదనపు డ్రైవర్‌గా ఉండేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతడు డబ్బు కోసం నిశ్చిత్‌ను కిడ్నాప్ చేయాలని కుట్ర పన్నాడు.
● బాలుడు జూలై 30న బుధవారం సాయంత్రం ట్యూషన్ ముగించుకుని 7:30 కు సైకిల్‌లో ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో గురుమూర్తి, గోపాలకృష్ణ తదితరులు బాలునికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. మీ నాన్న చెప్పాడు అని బాలున్ని దుండుగుడు బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తేలింది. ఆ సీసీ కెమెరా దృశ్యాలు లభించాయి.
● ట్యూషన్ ముగిసి ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించి రాత్రి 10 గంటలకు హుళిమావు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తాం
అంతలో బాలుని తండ్రికి కిడ్నాపర్లు ఫోన్ చేసి కుమారున్ని ప్రాణాలతో చూడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తామని వారు ఒప్పుకున్నారు. హుళిమావు పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు తీవ్రం చేశారు. ఓ పార్కు వద్ద బాలుని సైకిల్ దొరికింది. మరోవైపు పోలీసులకు దొరికిపోతామనుకున్న కిడ్నాపర్లు బాలుడు నిశ్చిత్‌ని బన్నేరుఘట్ట రోడ్డులో చెట్ల మధ్యలో గొంతు కోసి చంపి, ముఖం గుర్తు పట్టకుండా పెట్రోల్‌పోసి నిప్పుపెట్టినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది.
రూ. 5 లక్షలు డిమాండ్
ఇస్తామన్న తల్లిదండ్రులు
అంతలోనే హత్య చేసి నిప్పు
దుండగులపై పోలీసుల కాల్పులు, అరెస్టు
24 గంటల తరువాత..
గురువారం రాత్రి బన్నేరుఘట్ట రోడ్డు సమీపంలో చెట్లలో బాలుని మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు తెలిపారు. అర్ధరాత్రి కగ్గలిపుర రోడ్డులో దుండగులు దాగిఉన్నట్లు తెలిసి హుళిమావు పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దుండగులు మరణాయుధాలతో దాడికి దిగారు. దీంతో సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ అరవింద్‌కుమార్ కాల్పులు జరపగా గురుమూర్తికి రెండుకాళ్లు, గోపాలకృష్ణ కు కాలికి బుల్లెట్ తగిలి కూప్పకూలిపోయారు. పోలీసులు వారిని పట్టుకుని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు ఈ హత్యోదంతంలో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనాస్థలిని ఎలక్ట్రానిక్‌సిటీ డీసీపీ నారాయణ్, రూరల్ ఎస్పీ సీకే బాబా పరిశీలించారు.
బెంగళూరులో కిరాతకం.. బాలుడు కిడ్నాప్, హత్య
బెంగళూరులో కిరాతకం.. బాలుడు కిడ్నాప్, హత్య
బెంగళూరులో కిరాతకం.. బాలుడు కిడ్నాప్, హత్య