15 నుంచి ఎల్లో లైన్‌లో మెట్రో పరుగు? | - | Sakshi
Sakshi News home page

15 నుంచి ఎల్లో లైన్‌లో మెట్రో పరుగు?

Aug 2 2025 6:40 AM | Updated on Aug 2 2025 6:40 AM

15 ను

15 నుంచి ఎల్లో లైన్‌లో మెట్రో పరుగు?

దొడ్డబళ్లాపురం: రాజధానిలో నమ్మ మెట్రో త్వరలో ఎల్లో లైన్‌లో రైలు సంచారం ప్రారంభం కానుంది. ఎలక్ట్రానిక్‌ సిటీ ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేసే 19.15 కిలోమీటర్ల ఆర్‌వీ రోడ్డు– బొమ్మసంద్ర ఎల్లో లైన్‌లో, ఆ రూట్‌లోని అన్ని మెట్రో స్టేషన్‌లలో జూలైలో ప్రయాణ భద్రతా తనిఖీలు పూర్తయ్యాయి. సక్రమంగా ఉన్నాయంటూ అనుమతులు లభించాయి. ఆగస్టు 15న రైలు సంచారం మొదలయ్యే అవకాశముంది. గత మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ప్రతి 20 నిమిషాలకు ఒక మెట్రో రైలు సంచరిస్తుంది. సెప్టెంబరు నుంచి సర్వీసులు పెరుగుతాయి. ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్రకు వయా సిల్క్‌ బోర్డు జంక్షన్‌, ఎలక్ట్రానిక్‌ సిటీ ద్వారా మెట్రో సర్వీసుల వల్ల దక్షిణ బెంగళూరులో ప్రయాణ వసతి మెరుగవుతుంది.

అమ్మోనియా లీకై అస్వస్థత

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బైకంపాడి పారిశ్రామికవాడలో చేపల ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా వాయువు లీక్‌ అయింది. దీనితో 25 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం కార్మికులు పనిలో ఉండగా ట్యాంకు నుంచి వాయువు లీకై ంది. వాయువును పీల్చడంతో కళ్లు తిరిగి పడిపోయారు. ఏడు మంది కార్మికులు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. నలుగురికి వైద్యం చేసి పంపించారు.

వ్యాపారులకు నోటీసులు

శివాజీనగర: వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది రిజిస్టర్డ్‌ చిరు వ్యాపారులకు నోటీసులు జారీచేసింది. ఇందులో పాలు, కూరగాయలు, చిరుతిండ్లు, హోటళ్ల వ్యాపారులు ఉన్నారు. నోటీసుల్లో పన్ను డిమాండ్‌ లేదని, జీఎస్టీ ఖాతా రిజిస్ట్రేషన్‌ చేసువాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. ను పొందేందుకు కోరడమైనది. వ్యాపారుల ఖాతాల్లో యూపీఐ లావాదేవీల మొత్తాలను పరిశీలించి నోటీసులు ఇవ్వడం గమనార్హం.

మిమ్స్‌ కబ్జాలను

తొలగించాలి

మండ్య: మిమ్స్‌ ఆస్పత్రి స్థలంలోని తమిళ కాలనీతో పాటు 24 ఎకరాలకు పైగా ఉన్న స్థలంలో ఆక్రమణలను తొలగించడం లేదని, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని కర్ణాటక రక్షణ వేదిక, కరునాడ సేవకర సంఘం కార్యకర్తలు ఆరోపించాయి. ఆస్పత్రికి చెందిన స్థలాన్ని తమిళ కాలనీవాసులతో పాటు పలువురు ప్రముఖులు కబ్జా చేశారని కరునాడ సేవకర సంఘం నేత ఎంబీ నాగణ్ణగౌడ అన్నారు. ఈ స్థలాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని గత నెల 1న కన్నడ సంఘాలు, రైతు సంఘాలు బైక్‌ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. పోరాటానికి తలొగ్గిన జిల్లాధికారి, ఉప విభాగాధికారి, తహసీల్దార్‌, నగరసభ కమిషనర్‌ ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామని ఒప్పుకున్నారన్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. వెంటనే ఆక్రమణలు తొలగించకుంటే ఈనెల 15 నుంచి రెండో దశ పోరాటం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో నిరసనకారులు బైఠాయించి నిరసన తెలిపారు.

15 నుంచి  ఎల్లో లైన్‌లో మెట్రో పరుగు? 1
1/1

15 నుంచి ఎల్లో లైన్‌లో మెట్రో పరుగు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement