
ధర్మస్థలలో తీవ్ర గాలింపు
శివాజీనగర: ధర్మస్థల పుణ్యక్షేత్రంలో నేత్రావతి నదీ తీరంలో వందలాది మృతదేహాలను పాతిపెట్టిన కేసులో సిట్ అధికారులు, స్థానిక పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 8వ పాయింట్‌లో అన్వేషణను ముగించారు. కొత్తగా పురోగతి ఏమీ లేదని సమాచారం. 13వ స్థలంలో వందలాది శవాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదుదారు చెబుతున్నాడు. 7 పాయింట్లలో పూర్తి చేయగా 6వ పాయింట్‌లో అస్థిపంజరం అవశేషాలు లభించాయి. శుక్రవారం 7వ పాయింట్‌లో శోధించగా కర్చీఫ్ దొరికినట్లు తెలిసింది. తరువాత 8వ పాయింట్‌లో కూలీలు, మినీ జేసీబీ ద్వారా తవ్వకాలు ప్రారంభించారు.
మీడియాపై ఆంక్షలు రద్దు
ధర్మస్థల నేర విచారణ గురించి హైకోర్టు అతి ప్రాముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈ కేసులో మీడియాపై విధించిన ఆంక్షలను రద్దు చేసింది. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ పలు మీడియా సంస్థల విరుద్ధంగా గ్యాగ్ ఉత్తర్వులను తీసుకొచ్చారు. శుక్రవారం ఈ నిబంధనలను ప్రశ్నిస్తూ హైకోర్టుకు దక్షిణ కన్నడకు చెందిన కుడ్ల ర్యాంపేజ్ సంపాదకుడు అజయ్ సమర్పించిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారణ జరిపారు. మీడియాపై ఉన్న ప్రతిబంధకాదేశాన్ని రద్దుచేశారు.
8వ పాయింట్‌లో తవ్వకాలు