
కూలిన పాత కట్టడం
బనశంకరి: బెంగళూరు లో సంపంగి రామనగరలో జియో హోటల్ వద్ద పాత కట్టడం గురువారం ఆకస్మాత్తుగా కూలిపోయింది. 80 ఏళ్ల క్రితం నాటి రెండంతస్తుల కట్టడం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ధ్వంసమైంది. ఆ సమయంలో కట్టడంలో యజమాని అశ్విన్ ఉండగా తీవ్రంగా గాయపడ్డాడు.
సంపును తవ్వుతుండగా
వివరాలు.. నెల కిందట వరకు ఈ భవనంలో ఓ కుటుంబం బాడుగకు ఉండేది. వారు ఖాళీ చేయడంతో వంటశాలగా ఉపయోగిస్తున్నారు. అలాగే సంపు కోసం ముగ్గురు కార్మికులతో తవ్వకం చేపట్టారు. కూలిపోవడానికి 10 నిమిషాల ముందు ముగ్గురు కార్మికులు భోజనానికి బయటకు వచ్చారు. అశ్విన్ ఒక్కడే అందులో ఉన్నాడు. ఇంతలో పెద్దశబ్ధంతో భవనం కుప్పకూలిపోయింది. వెంటనే స్థానికులు అతి కష్టమ్మీద అశ్విన్‌ను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని లోపల ఇంకా ఎవరైనా చిక్కుబడ్డారా అని తనిఖీలు చేశారు. పాత భవనం కావడం, సంపు గుంతను తవ్వడం వల్ల ప్రకంపనలకు కూలిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలో పాత భవనాల మనుగడ మరోసారి చర్చకు వచ్చింది. బీబీఎంపీ సిబ్బంది తమ వలయాల్లోని పాత భవనాలను ఖాళీ చేయాలని గతంలో కార్యాచరణ చేపట్టారు. కానీ కొన్నిరోజులకే అది అటకెక్కింది.
యజమానికి తీవ్ర గాయాలు
తృటిలో తప్పించుకున్న కూలీలు
బెంగళూరులో ఘటన

కూలిన పాత కట్టడం

కూలిన పాత కట్టడం