అల్లుని దాష్టీకం.. కుటుంబం ఛిన్నాభిన్నం | - | Sakshi
Sakshi News home page

అల్లుని దాష్టీకం.. కుటుంబం ఛిన్నాభిన్నం

Jul 4 2024 2:08 AM | Updated on Jul 4 2024 10:17 AM

అల్లు

అల్లుని దాష్టీకం.. కుటుంబం ఛిన్నాభిన్నం

బావమరిది హత్య...

తట్టుకోలేక అత్త ఆత్మహత్య

మైసూరు: ఓ అల్లుని ధన దాహానికి కుటుంబం ఛిన్నాభిన్నమైంది. అల్లుని చేతిలో కుమారుడిని కోల్పోయిన ఒక మాతృమూర్తి ఆ ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మైసూరులోని కోర్గళ్లిలో జరిగింది. మృతురాలు భాగ్యమ్మ (46). గత నెల 9న ఆమె కుమారుడు అభిషేక్‌ను ఆమె అల్లుడు రవిచంద్రన్‌ కత్తితో పొడిచి హత్య చేశాడు. రామకృష్ణనగరలో ఉండే రవిచంద్రన్‌ అదనపు కట్నం తేవాలని భార్యను వేధిస్తూ తరచూ కొట్టేవాడు.

చెల్లిని వేధించవద్దన్నందుకు
తన చెల్లిని వేధించవద్దని బావకు నచ్చజెప్పేందుకు వెళ్లిన అభిషేక్‌ను బావ గొడవపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆనాటి నుంచి కొడుకు చనిపోయాడు, కూతురి జీవితం భగ్నమైందని బాధపడుతూ ఉన్న భాగ్యమ్మ జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విజయనగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఒకే కుటుంబంలో తల్లీ కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement