అమ్మవారికి విశేష పూజలు | Sakshi
Sakshi News home page

అమ్మవారికి విశేష పూజలు

Published Sun, May 19 2024 4:45 AM

అమ్మవ

బనశంకరి: భక్తుల మొక్కుల తీర్చే కల్పవల్లి బనశంకరీ దేవి భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చింది. శనివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం అర్చకుడు ఏ.చంద్రమోహన్‌ అమ్మవారి మూలవిరాట్‌ కు అభిషేకం, అర్చనలు చేశారు. పలు పుష్పాలతో అలంకకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

లంచగొండ్ల ఆటకట్టు

పలుచోట్ల లోకాయుక్త దాడులు

దొడ్డబళ్లాపురం/ యశవంతపుర: లంచం తీసుకుంటూ ఎస్సై, కానిస్టేబుల్‌ లోకాయుక్త వలలో చిక్కిన సంఘటన హావేరి జిల్లి శిగ్గాంవ్‌ తాలూకా తడస పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శరణబసప్ప, కానిస్టేబుల్‌ సురేశ్‌లు తమ స్టేషన్‌ పరిధిలో పేకాట ఆడించడానికి రూ.5 లక్షలు డిమాండు చేశారు. ప్రభాకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసులు ఎస్సై, కానిస్టేబుల్‌ రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు.

సర్వే చేయడానికి ముడుపులు

లోకాయుక్త పోలీసులు శనివారం కలబురగి, విజయపురలో ఇద్దరు లంచగొండ్లను పట్టుకున్నారు. విజయపురలో రైతు ప్రకాష్‌సింగ్‌ భూమిని సర్వే చేయడానికి సర్వేయర్‌ మల్లప్ప జంబగి రూ. 47 వేల లంచం తీసుకొంటూ ఉండగా అరెస్టు చేశారు. కలబురగిలో విద్యాశాఖ కార్యాలయానికి చెందిన ఎఫ్‌డిఎ శివశంకర్‌ పదో తరగతి మార్కుల కార్డు నకలు ఇవ్వడానికి అరుణ్‌ ఖతీబ్‌ అనే వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకొంటూ లోకాయుక్తకు చిక్కాడు. ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

విమానానికి

బాంబు బెదిరింపు.. అరెస్టు

దొడ్డబళ్లాపురం: బెంగళూరు నుంచి పూణెకి బయలుదేరే విమానంలో బాంబు పెట్టినట్టు బెదిరించిన దుండగున్ని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. హరియానాలోని హిస్సార్‌కు చెందిన రాజేశ్‌కుమార్‌ దేనివాల్‌ నిందితుడు. బెంగళూరు నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించడానికి దేనివాల్‌ వచ్చాడు. చెక్‌ఇన్‌ వద్దనున్న బ్యాగ్‌లో బాంబు ఉందంటూ బెదిరించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని, విమానంలో బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీ చేయగా ఎలాంటి బాంబు లభించలేదు. అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

మిస్టరీగా దంపతుల మృతి

తేల్లారేసరికి శవాలుగా..

పిరియాపట్టణలో ఘటన

మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ గొల్లరవీధి ఇంట్లో దంపతులు శవమై తేలారు. ప్రకాశ్‌ (47), యశోద (46)లు మృత దంపతులు. వివరాలు.. తాలూకా పంచాయతీ వద్ద టీ అంగడి నిర్వహిస్తున్న ప్రకాశ్‌, యశోదకి తనుశ్రీ అనే కుమార్తె ఉంది. మైసూరు యువరాజు కాలేజీలో ఆమె బీఎస్సీ చదువుతూ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. ఇక గురువారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చిన దంపతులు తమ ఇంట్లో నిద్రించారు. శుక్రవారం బయటకు రాలేదు, టీ దుకాణం కూడా తెరవలేదు.

కూతురు కాల్‌ చేస్తే

కుమార్తె ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన తనుశ్రీ తన బంధువులకు సమాచారం అందించింది. ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూడగా యశోద మంచంపై విగతజీవిగా కనిపించింది. ప్రకాశ్‌ మృతదేహం తలుపు వద్ద కనిపించింది. ఇవి హత్యలా, ఆత్మహత్యలా అనేది మిస్టరీగా ఉంది. జిల్లా ఎస్పీ సీమా లాట్కర్‌ , అదనపు ఎస్పీ నందిని చేరుకుని పరిశీలించారు. పిరియాపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

అమ్మవారికి విశేష పూజలు
1/2

అమ్మవారికి విశేష పూజలు

అమ్మవారికి విశేష పూజలు
2/2

అమ్మవారికి విశేష పూజలు

Advertisement
 
Advertisement
 
Advertisement