
వైభవంగా కరగ ఉత్సవం
కోలారు: తాలూకాలోని చిట్నహళ్లి గ్రామంలోని ధర్మరాయస్వామి పూల కరగ ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి అశేష భక్త సందోహం మధ్య వైభవంగా నిర్వహించారు. గ్రామంలో గత మూడేళ్లుగా కరగ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న కరగ పూజారి బాలరాజ్ మూడోసారి ఆలయం ముందు మంగళవాయిద్యాలు, మేళతాళాలకు అనుగుణంగా పూల కరగను మోస్తూ చేసిన నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వీర కుమారుల గోవిందనామ స్మరణ మధ్యన కరగ సాగింది. గ్రామానికి చెందిన తిగళ సముదాయం వారు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో కరగ నిర్వహిస్తున్నారు. భక్తులు తమ ఇంటి వద్దకు వచ్చిన కరగను భక్తిశ్రద్ధలతో పూజించారు. ఉత్సవంలో జీపీ అధ్యక్షుడు మంజునాథ్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి
ఎమ్మెల్యే విరాళం
కోలారు: రాజకల్లహళ్లి గ్రామంలోని ధర్మరాయస్వామి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ శనివారం రూ.3 లక్షల విరాళం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలోని ఆలయాలను అభివృద్ధి చేసి నిత్యం పూజా విధివిధానాలను నిర్వహించాల్సి ఉందన్నారు. ధార్మిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా మనస్సుకు శాంతి, నెమ్మది లభిస్తుందన్నారు. పీఎల్‌డీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు చంజిమలై రమేష్, గ్రామ ప్రముఖులు వెంకటరామేగౌడ, జీపీ సభ్యుడు సత్యనారాయణ, ఎంపీసీఎస్ అధ్యక్షుడు మునిరాజు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కరగ ఉత్సవం