పట్టాలు తప్పిన గూడ్స్‌ | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌

Published Fri, Nov 17 2023 1:08 AM

చిత్రదుర్గలో స్వామీజీని కలిసిన  విజయేంద్ర    - Sakshi

పలు రైళ్ల రాకపోకలు రద్దు

హొసపేటె: నగర సమీపంలోని వ్యాసనకేరి రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్‌ రైలు 10 బోగీలు పట్టాలు తప్పగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మార్గంలో సంచరించాల్సిన వివిధ రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. యశ్వంతపుర–విజయపుర ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గాన్ని మళ్లించారు. సాయంత్రం తర్వాత ఈ మార్గంలో వెళ్లాల్సిన హొసపేటె–హరిహర ప్యాసింజర్‌, హరిహర–బళ్లారి డెమో స్పెషల్‌, బళ్లారి–హరిహర డెమో స్పెషల్‌ రైళ్లను రద్దు చేశారు.

లంచగొండి పీడీఓ

శివమొగ్గ: మహిళ నుంచి లంచం తీసుకుంటూ శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకాలోని బగనకట్టె గ్రామ పంచాయతీ పీడీఓ మంజునాథ్‌ లోకాయుక్తకు దొరికిపోయాడు. వివరాలు.. సంక్లాపురకి చెందిన సాకమ్మ అనే మహిళ ఇల్లు 2021లో అతివృష్టికి పాక్షికంగా కూలింది. ఆర్థిక సాయం కోసం రాజీవ్‌గాంధీ వసతి పథకం ద్వారా దరఖాస్తు చేసింది. పరిహారం మంజూరుకు రూ. 20 వేలు లంచాన్ని మంజునాథ్‌ డిమాండ్‌ చేసి ఇప్పటికి రూ. 13 వేలు తీసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి ఆమెకు రూ. 5 లక్షల సాయం మంజూరైంది. ఈ నగదు నీ ఖాతాలో పడాలంటే ముడుపు మొత్తం ఇవ్వాలని మంజునాథ్‌ ఒత్తిడి చేశాడు, దీంతో ఆమె గురువారం ఆఫీసులో అతనికి రూ. 6 వేలు ఇస్తుండగా లోకాయుక్త అధికారి ఎన్‌.వాసుదేవ, ఇతర సిబ్బంది అరెస్టు చేశారు.

అధిక ఎంపీ సీట్లే లక్ష్యం

బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర

సాక్షి,బళ్లారి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను అన్ని స్థానాల్లోను తమ అభ్యర్థుల గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర పేర్కొన్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం చిత్రదుర్గం జిల్లాకు వచ్చి చిత్రదుర్గ మురుఘ మఠంలో సమాధిని దర్శించుకున్న తర్వాత మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి నివాసానికి చేరుకుని పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టిందన్నారు. మళ్లీ మోదీని ప్రధానమంత్రిని చేయడానికి కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో లోక్‌సభ సభ్యులను గెలిపించడమే తన ముందున్న ఏకై క లక్ష్యం అన్నారు.

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు వ్యాగన్లు
1/2

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు వ్యాగన్లు

పీడీఓ మంజునాథ్‌
2/2

పీడీఓ మంజునాథ్‌

Advertisement
 
Advertisement