
మాట్లాడుతున్న మంత్రి తిమ్మాపూర్
రాయచూరు రూరల్: ఆల్మట్టి డ్యాంలో నీటి కొరత నేపథ్యంలో కాలువలకు సాగునీటి విడుదల అసాధ్యమని ఎకై ్సజ్ శాఖా మంత్రి ఆర్‌బీ.తిమ్మాపూర్ ప్రకటించారు. మంగళవారం ఆల్మట్టి డ్యాం వద్ద అతిథి భవనంలో తన అధ్యక్షతన జరిగిన నీటిపారుదల సలహా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర కర్ణాటకలోని ఎమ్మెల్యేల ఒత్తిడితో ఖరీఫ్‌కు నీరు వదిలామన్నారు. ఆల్మట్టి డ్యాంలో ప్రస్తుతం కేవలం 62 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నాయన్నారు. జల మండలి అధికారులు డిసెంబర్ 4 వరకు కాలువలకు నీటి విడుదలకు నీటిపారుదల సలహా సమితి అంగీకరించిందన్నారు. నారాయణపుర కుడి, ఎడమ కాలువల ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. రబీలో రైతులు వేసుకున్న పత్తి, కంది, వరి, మిరప పంటలకు నీరు లేక వాడుముఖం పట్టాయన్నారు. అయితే రెండో పంటకు నీరు విడుదల చేయడం లేదని మంత్రి అన్నారు. 40 టీఎంసీల నీరు తాగునీటి అవసరాల కోసం కేటాయించామన్నారు. సమావేశంలో పలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు.