ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలి

- - Sakshi

చిక్కబళ్లాపురం: చింతామణి ఎమ్మెల్యే ఎంసీ సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని తాను ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసినట్లు చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ తెలిపారు. సోమవారం ఆయన నగరంలో నమస్తే చిక్కబళ్లాపురం కార్యక్రమంలో భాగంగా శిడ్లఘట్ట రోడ్డులో దళిత కాలనీలోని సమస్యలను ఆలకించడానికి వచ్చారు. అక్కడే అల్పాహారం తీసుకుని వారి సమస్యలను విన్నారు.

ఈ కాలనీలో ఆరుగురు హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారని, వారిని జయదేవ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తానని ప్రదీప్‌ తెలిపారు. ఇక్కడ తాగునీటి సమస్య ఉందని, త్వరలో పరిష్కరిస్తానన్నారు. మునపటి ఎమ్మెల్యేలు కనీసం ఓట్లు అడగటానికి కూడా దళిత కాలనీలో అడుగు పెట్టలేదని అన్నారు. అంతకు ముందు ఆయన అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం మునియప్ప, నగరసభ సభ్యుడు వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top