సీఎం ఎంపికకు మఠాధిపతుల లాబీ ? | - | Sakshi
Sakshi News home page

సీఎం ఎంపికకు మఠాధిపతుల లాబీ ?

May 16 2023 6:18 AM | Updated on May 16 2023 7:16 AM

- - Sakshi

శివాజీనగర: ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మఠాధిపతుల జోక్యం పెరుగుతోంది. పలువురు మఠాధిపతులు తమ సముదాయం నాయకులకు అధికారం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. మఠాధిపతుల రాజకీయ జోక్యంపై కాంగ్రెస్‌ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది.

ఇదిలా ఉంటే ఆయా సముదాయానికి చెందిన మఠాధిపతులు బహిరంగ ప్రకటనలు చేసి గందరగోళం సృష్టిస్తుండటంపై అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికై న ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ వినపడుతోంది. అయితే ప్రారంభంలోనే కుల రాజకీయాలు తగదనే వాదన వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement