బొమ్మనహళ్లి: నీట్ అవకతవకలకు నిరసనగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీఛార్జ్, కాల్పులు జరపడం అమానుషమని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హావేరి నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులమని చెప్పుకుంటున్న కొందరు గూండాలు విద్యార్థులపై దాడి చేశారు. చాలా మంది గాయపడ్డారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యా వ్యవస్థను దిగజార్చింది, ప్రశ్నాపత్రాలను లీక్ చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం చేస్తోంది, అటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పుతారన్నారు.


