బనశంకరి: బెంగళూరు దక్షిణ ప్రాంతం, లేదా తుమకూరులో రెండో విమానాశ్రయం నిర్మాణానికి స్థలం ఎంపిక గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం లోక్‌సభలో ఎంపీ పీసీ.మోహన్ అడిగిన ప్రశ్నకు విమానయాన సహాయ మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు బారతీయ విమానాశ్రయ ప్రాధికార బెంగళూరు చుట్టుపక్కల మూడు ప్రదేశాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదనకు రాష్ట్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. రాష్ట్ర సర్కారు ఆమోదించిన వెంటనే రెండో విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుందని చెప్పడం గమనార్హం. మరో పక్క బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు సరాసరి 1.23 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, వార్షిక సామర్థ్యం 5.16 కోట్లుగా ఉంది. రద్దీని తట్టుకోవడానికి టెర్మినల్– 2ను విస్తరించాలని పథకం రూపొందించారు.


