రైతులు తమ వ్యవసాయభూమిలో కొంత భాగంలో తప్పకుండా కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి. పావు ఎకరంలో నాలుగైదు రకాల కూరగాయలు సాగు చేస్తే ఆరు నెలల పాటు దిగుబడి వస్తుంది. తెంపి అమ్ముకుంటే ప్రతిసారి రూ.500 వరకు వస్తాయి. సమయానుకూలంగా టమాటా, మిర్చి, వంకాయ వంటి నారు పోయాలి. మెంతి, కొత్తిమీరతో ఎంతో లాభం. ఎక్కడ కాస్త స్థలం ఉన్నా వాటిని సాగు చేయాలి. వరి, మొక్కజొన్నను రెండు ఎకరాల్లో సాగు చేస్తే ఎంత డబ్బులొస్తాయో పావు ఎకరం కూరగాయల సాగుతో అంతకన్నా ఎక్కువ ఆదాయం గడించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


