సంచార లోక్‌ అదాలత్‌ వాహనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సంచార లోక్‌ అదాలత్‌ వాహనం ప్రారంభం

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

ఆంక్షలు పొడిగింపు

కరీంనగర్‌క్రైం: గ్రామీణ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ఉచిత న్యాయసాయంపై అవగాహన కల్పించి, లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను సత్వరమే పరి ష్కరించేందుకు సంచార లోక్‌ అదాలత్‌, ఉచిత న్యాయ సేవల వాహనం అందుబాటులోకి వచ్చింది. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శివకుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అందించిన ఈ వాహనం ద్వారా కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో న్యాయ సేవలు అందించనున్నారు. ప్రతి నెలా ఒక్కో జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించనున్నా రు. ఈ వాహనం గ్రామాల్లోని ప్రధాన కూడళ్లకు చేరుకుని వీడియో ప్రదర్శనల ద్వారా న్యా య సేవాధికార సంస్థ పనితీరు, ఉచిత న్యాయసాయం పొందే హక్కు, లోక్‌ అదాలత్‌ ప్రయోజనాలను వివరించనుంది. తద్వారా ప్రజలకు సులభంగా న్యాయం అందించడమే లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి యశ్వంత్‌ సింగ్‌ తెలిపారు.

హామీలు అమలు చేయకుంటే పోరాటమే

హుజూరాబాద్‌: రిటైర్డ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం హుజూరాబాద్‌లో మా ట్లాడుతూ పీఆర్సీని ఇప్పటివరకు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగవిరమణ చేసినవారికి అందాల్సిన బెనిఫిట్స్‌ పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రిటైర్డ్‌ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఉస్మాన్‌ భాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలి మ హేందర్‌రెడ్డి, నాయకులు గంజి జయవర్ధన్‌, నరెడ్ల రాజమణి, గోపాల్‌రావు పాల్గొన్నారు.

బీజేపీ పాలకవర్గ అవినీతిపై సంజయ్‌ సమాధానం చెప్పాలి

కరీంనగర్‌ టౌన్‌: నగరపాలక సంస్థలో బీజేపీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మంకమ్మతోటలోని మీకోసం కార్యాలయంలో మాట్లాడుతూ బీజేపీ పాలకవర్గ సభ్యులు అవినీతికి పాల్ప డితే బ్లాక్‌లిస్టులో పెడతానని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలే అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. జనరల్‌ ఫండ్‌, యూఏడీఎఫ్‌ నిధులు కలిపి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్లలో భవన నిర్మాణ అనుమతుల విషయంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. గత ఎనిమిది నెలల 15 రోజుల్లో జారీ చేసిన అనుమతుల వివరాలను పరిశీలించి, భవన యజమానులను విచారించాలని సూచించారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, అనూప్‌కుమార్‌, ఆరె రవి పాల్గొన్నారు.

కరీంనగర్‌క్రైం: కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలని సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. డీజేల వినియోగం, డ్రోన్లు, పారాగ్లైడర్ల వినియోగంపై నిషేధాజ్ఞలను ఈ నెల 30 వరకు పొడిగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement