పదోన్నతితో మరింత బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పదోన్నతితో మరింత బాధ్యత

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

● సమర్థవంతమైన విధులు నిర్వహించాలి: సీపీ గౌస్‌ ఆలం ● పీటీసీలో 374 మందికి పదోన్నతి శిక్షణ ప్రారంభం

కరీంనగర్‌ క్రైం: పోలీసుశాఖలో పదోన్నతి పొందుతున్న అధికారులు పెరిగిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సీపీ గౌస్‌ఆలం సూచించారు. ఏఎస్‌ఐ నుంచి ఎస్‌ఐ, ఏఆర్‌ఎస్‌ఐ నుంచి ఆర్‌ఎస్‌ఐ పదోన్నతి పొందనున్న అధికారులకు కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రమోషనల్‌ శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా తమ పరి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నా రు. నూతనంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత , భారతీయ సాక్ష్య అధినియం చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్‌, ఏఎస్పీ ఎం.పిచ్చయ్య మాట్లాడుతూ 315 మంది సివిల్‌ ఏఎస్సైలు మూడు నెలల పాటు ఎస్‌ఐ పదోన్నతి శిక్షణ పొందనున్నారన్నారు. వీరి లో 280 మంది పురుషులు, 35మంది మహిళలు ఉన్నారన్నారు. ఏఆర్‌కు చెందిన 59మంది, మొత్తంగా 374 మంది శిక్షణలో పాల్గొంటున్నట్లు వివరించారు. పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్స్‌ మల్లికార్జున్‌, బి.గంగాధర్‌, డీఎస్పీలు పి.శివరామయ్య, జి.విజయపాల్‌రెడ్డి, బి.నారాయణ, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement