ఢిల్లీ నిరసనలో జిల్లా నేతలు | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నిరసనలో జిల్లా నేతలు

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో పేరిట ఢిల్లీలో ఆదివారం ఏఐసీసీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, పీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌ కుమార్‌, సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, కార్పొరేటర్లు వరాల నర్సింగం, కాంతాల జగన్‌ రెడ్డి, పర్వతం మల్లేశం పాల్గొన్నారు.

జాబ్‌మేళాకు విశేష స్పందన

కరీంనగర్‌ సిటీ: ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. కళాశాల తెలంగాణ స్కిల్స్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన రుచిత అసోసియేట్స్‌ సంస్థ సహకారంతో మేళా నిర్వహించారు. ప్రైవేటు రంగ సంస్థల్లో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, సోలార్‌ సిస్టమ్స్‌ తయారీ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఎస్‌కేసీ కోఆర్డినేటర్‌ బొడ్డు సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ జాబ్‌మేళా డిగ్రీ విద్యార్థులకు ఎంతో ఉపయోగం అన్నారు.

ఆర్మీ జవాన్‌కు ఘనస్వాగతం

మానకొండూర్‌: 18ఏళ్లపాటు దేశసేవ చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఆదివారం గ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్‌కు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ఆరెల్లి రాధ వెంకటనర్సు కొడుకు ఆరెల్లి మహేందర్‌ 2009లో ఆర్మీలో చేరాడు. వివిధ హోదాల్లో జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్తాన్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు నిర్వహించాడు. 18 ఏళ్ల పాటు దేశసేవ చేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. ఈ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన మహేందర్‌కు గ్రామస్తులు, కుటుంబసభ్యులు స్నేహితులు దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

ఎస్జీఎఫ్‌ క్రీడలు విజయవంతం చేయాలి

కరీంనగర్‌స్పోర్ట్స్‌: జిల్లాలో నిర్వహించే జోనల్‌, జిల్లా, రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్‌ క్రీడలు విజయవంతం చేయాలని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పీటీఐ వ్యాయామం ఉపాధ్యాయులకు మినిమం స్కేల్‌ వర్తింపజేయాలన్నారు. జిల్లాలోని 16 మండలాల్లో వ్యాయామ ఉపాధ్యాయ సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఎస్జీఎఫ్‌ కార్యదర్శి బన్సీలాల్‌ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో అన్ని క్రీడలు విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు కరీంనగర్‌ సెయింట్‌ ఆల్ఫోన్స్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా, ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రతినిధులు కృష్ణ, వీరన్న, శ్రీనివాసరావు, కనకం సమ్మయ్య, బిట్ర శ్రీనివాస్‌, వంగపల్లి సూర్యప్రకాష్‌, రమేశ్‌, రవి, చంద్రశేఖర్‌, బాలసాని రాజ్‌కుమార్‌, సత్యనారాయణ, లక్ష్మణ్‌, శ్రీలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement