అన్నకూటోత్సవం.. సహస్రదీపాలంకరణ | - | Sakshi
Sakshi News home page

అన్నకూటోత్సవం.. సహస్రదీపాలంకరణ

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో జరుగుతున్న 40వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి పలు విశేషసేవలు నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనసేవ, పూలంగిసేవ, అష్టాదశ పాదపద్మారాధన, అన్నకూటోత్సవం నిర్వహించారు. సాయంత్రం మహాశాంతి హోమం, సహస్రదీపాలంకరణ, గజవాహనసేవలు అలరించాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 40 మంది ప్రముఖులకు ప్రజ్ఞా పురస్కారాలను అందజేశారు. సర్వవైదిక సంస్థానం మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాద్‌, సంస్థానం సభ్యులు పాల్గొన్నారు. సోమవారం రథోత్సవం, చూర్ణోత్సవం, పూర్ణాహుతి, శ్రీపుష్పయాగం, ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. – కరీంనగర్‌ కల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement