జమ్మికుంట: సీఎమ్మార్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. అక్రమాల ఆరోపణ ఎదుర్కొంటున్న నలుగురు మిల్లర్లను విచారించేందుకు కోర్టులో కస్ట డీ పిటిషన్ వేసినట్లు తెలిసింది. 8 రోజుల క్రితం జ మ్మికుంట, హుజూరాబాద్‌కు చెందిన నలుగురు మిల్లర్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సదరు మిల్లర్ల భాగస్వామలు మిల్లులకు తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో సీఐడీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండురోజుల్లోగా అందుబాటులోకి రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోమవారం జిల్లా కోర్టు మిల్లర్లు, సీఐడీ పిటిషన్లపై వి చారించనున్నట్లు తెలిసింది. దీంతో మిల్లర్లకు కస్టడి యా.. బెయిలా.. అని ఉత్కంఠ నెలకొంది.
భయం భయంగా మిల్లర్లు
సీఐడీ దూకుడు నేపథ్యంలో మిల్లర్లు భయం భయంగా గడుపుతున్నారు. సన్నాలు మాయం చేసి దొడ్డు రకం బియ్యం ఇవ్వగా.. సదరు వ్యత్యాసంపై కొందరు ప్రభుత్వానికి డీడీల ద్వారా సన్నాల మిగులు డబ్బులు చెల్లించారు. మరికొందరు డీడీలు తీశారు. డీడీలు తీసిన మిల్లర్లపై సైతం కేసులు కా నున్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లు బెయిల్‌కోసం హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. సీఐడీ కేసులు నమోదైనవారందరూ అరెస్ట్ అయ్యేవరకు మిల్లర్లకు బెయిల్ వచ్చే చాన్స్ లేదని, ఇంకా ఎంత మంది మిల్లర్లపై కేసులు నమోదవుతాయనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది.


