పదేళ్లుగా దేశీయ ఆవులైన గిర్ ఆవులను పెంచుతున్నాను. వాటి ద్వారా వచ్చే పాలను ఇంటి అవసరాలకు వాడుకుంటూ, ఆవి విసర్జించే పేడ, మూత్రంతో జీవామృతం, ఘనామృతం తయారు చేసి పంటలకు వాడుతున్నాను. ఎలాంటి రసాయన ఎరువులు వేయకుండానే మంచి దిగుబడులు వస్తున్నాయి.
– మిట్టపెల్లి రాములు, తుంగూర్, బీర్పూర్(మం)
దేశీయ ఆవులతో అనేక ప్రయోజనాలు
దేశీయ ఆవుల వల్ల అనేక ప్రయోజనాలు ఉండటంతో చాలా మంది ఇప్పటికే గ్రామాల్లో పెంచుతున్నారు. దేశీయ ఆవుల పాలకు చాలా డిమాండ్ ఉంది. పశు సంవర్ధక శాఖ ద్వారా గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– బి.ప్రకాష్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి, జగిత్యాల


