కరీంనగర్‌క్రైం: బాలలపై లైంగిక నేరాల నివారణ, వారి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం తీగలగుట్టపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 26 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ తెలిపారు. తీగలగుట్టపల్లి పాఠశాలలో నిర్వహించిన సదస్సులో విద్యార్థులకు పోక్సో చట్టం గురించి న్యాయవాదులు కిరణ్‌కుమార్, చంద్రప్రకాష్‌రెడ్డి, రంగయ్య వివరించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పగలిగే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. బాలలపై లైంగిక నేరాల నివారణకు సామాజిక చైతన్యం తీసుకురావడమే ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశమని జడ్జి యశ్వంత్‌సింగ్ తెలిపారు. హెచ్‌ఎం కరుణశ్రీ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దూస మమత తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌పై ప్రత్యేక దృష్టి
కరీంనగర్‌అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎస్ వీసీ అ నంతరం అధికారులతో మాట్లాడారు. లాజికల్ వ్యత్యాసాలు 202, మ్యాపింగ్ లేనివిగా 243గా గుర్తించామని తెలిపారు. అత్యధిక సంఖ్యలో అర్హత లేని ఓటర్లు నమోదైనందున దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఫాం 6కు సంబంధించి 2,875 దరఖాస్తుల్లో 2,403, ఫాం 8కి సంబంధించి 1,666 దరఖాస్తుల్లో 1,440 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పెండింగ్ దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
వేగంగా కోర్టు కేసుల పరిష్కారం
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో మాట్లాడారు. మొత్తం 306 పెండింగ్ కేసుల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని అన్నారు. నిర్ణీత కాల పరిమితిలోగా పెండింగ్ కేసుల పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
కరీంనగర్‌క్రైం: వాల్మీకి మహర్షి బోధనలు సమాజానికి ఆదర్శమని సీపీ గౌస్‌ఆలం అ న్నారు. వాల్మీకి జ యంతి సందర్భంగా సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మానవా ళికి సత్యం, ధర్మం, నైతిక విలువలను బోధించిన వాల్మీకి మార్గం సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొని వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు.
జాతీయస్థాయి పురస్కారానికి ఎంపిక
వీణవంక: వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కుమార్ జాతీయస్థాయి విజయదశమి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ను అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్‌లో త్యాగరాయ గానసభ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందించిన ప్రతిభావంతులను సత్కరించారు. కుమార్‌ను స్వర్ణకంకణంతో సత్కరించి విజయదశమి పురస్కారం అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ జాతీయస్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయమని అధ్యాపకులు తెలిపారు. గ్రంథపాలకుడు రామ్మెహన్, అధ్యాపకులు రవీందర్, శైలజ, సుమలత, కరుణ, స్పప్న ఉన్నారు.


