కరీంనగర్‌కార్పొరేషన్: శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవా రం 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలో రూ.11 లక్షలు సాధారణ నిధులతో ఎస్‌డబ్యూజీ పైప్‌లైన్, సీసీ రో డ్డు, 32వ డివిజన్ హుస్సేనిపురలో కార్పొరేటర్ షేక్ యూసుఫ్‌తో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, 34వ డివిజన్ హుస్సేనిపురలో కార్పొరేటర్ సమీనా పర్వీన్‌తో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. 1వ డివిజన్ ఆరెపల్లిలో కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్‌తో కలిసి రూ.27 లక్షల సాధారణ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలువురు అధికారులు, ఆయా డివిజన్ వాసులు పాల్గొన్నారు.


