బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

● 28 చోట్ల పాయింట్లు.. అధికారులకు బాధ్యతలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నిర్వహణకు బల్దియా సమాయత్తమైంది. నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో సద్దుల బతుకమ్మకు ఆడేందుకు, నిమజ్జనం చేసేందుకు 28 చోట్ల పాయింట్లు ఏర్పాటు చేయడంతో పాటు, పర్యవేక్షణకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. మానేరువాగు హనుమాన్‌ ఆలయం, గార్లకుంట, మార్క్‌ఫెడ్‌, చింతకుంట, వేదభవన్‌ మానేరు బ్రిడ్జి కింద, గౌతమినగర్‌ (వాటర్‌ట్యాంక్‌,డ్యాం వద్ద),గౌతమినగర్‌ (పీజీ కాలేజ్‌, డ్యాం), మానకొండూరు, రామచంద్రాపూర్‌కాలనీ (డ్యాం), శ్రీనగర్‌కాలనీ(డ్యాం),సప్తగిరికాలనీ(డ్యాం)మార్కండేయనగర్‌ (డ్యాం మట్టికట్ట స్టార్టింట్‌ పాయింట్‌),మార్కండేయనగర్‌ వ్యాన్‌ అడ్డా, కొత్తపల్లి, అలుగునూరు (వశిష్ట డిగ్రీ కళాశాల సమీపంలో), అలుగునూరు పాతవాడ, సదాశివపల్లి, పద్మనగర్‌ (డ్యాం బ్రిడ్జివద్ద), రేకుర్తి వెంకటమ్మ చెరువు, సీతారాంపూర్‌ సాయిబాబా గుడి పక్కన, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, వల్లంపహాడ్‌, గిద్దెపెరుమాండ్ల గుడి, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌, బొమ్మకల్‌ చెరువు, సీఎం పాయింట్‌, హౌసింగ్‌బోర్డుకాలనీ కేబుల్‌ బ్రిడ్జి వద్ద నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేశారు.

అధికారులకు బాధ్యతలు

నిమజ్జన పాయింట్ల వారీగా అధికారులకు నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ బాధ్యతలు కేటాయించారు. ఒక్కో పాయింట్‌కు ఇంజినీరింగ్‌ అధికారి, పర్యవేక్షణ అధికారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. ఈ అధికారులు తమకు కేటాయించిన పాయింట్లలో పిచ్చిపొదలు తొలగించడం, స్థలాన్ని చదును చేయడం, స్టోన్‌ డస్ట్‌తో గుంతలుపూడ్చడం, బారికేడింగ్‌ ఏర్పాటు చేయడం, సున్నం, రంగులతో హద్దులు గుర్తించడం, లైటింగ్‌, వేదికలు, తాగునీటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే సీరియల్‌ బల్బ్‌స్‌తో అలంకరించాలి. పూల వ్యర్థాలు, చెత్త సేకరించడం, సున్నం, బ్లీచింగ్‌ చల్లడం, పారిశుధ్యాన్ని నిర్వహించే బాధ్యతలను అప్పగించారు.

పరిశీలించిన మేయర్‌

కొత్తపల్లి: సద్దుల బతుకమ్మ వేడుకలకు నగరపాలక సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసిందని, రూ.3 కోట్ల నిధులతో సౌకర్యాలు కల్పించినట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు వాసాల రమేశ్‌, కవితతో కలిసి కొత్తపల్లి నిమజ్జన ఘాట్‌ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రతి పాయింట్‌ వద్ద బారికేడింగ్‌, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. తాగునీరు, లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌, పారిశుధ్య సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నగర ప్రజలు సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement