హాజరైన భక్తులు
పల్లకీసేవలో పాల్గొన్న కేంద్రమంత్రి సంజయ్ కుమార్
కళాకారుల నృత్య ప్రదర్శన
మహాశక్తి ఆలయంలో కొనసాగుతున్న పల్లకీ సేవ, పాల్గొన్న భవానీ దీక్షాపరులు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని శ్రీ మహాశక్తి ఆలయంలో శుక్రవారం మూలా నక్షత్రం సరస్వతిదేవీ(కాత్యాయనీ) అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు విద్యార్థుల అక్షరాభ్యాసం, పుస్తకాల పూజ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు యాదవ్ దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారి పల్ల కీసేవ వైభవంగా సాగింది. దాండియా కార్యక్రమానికి వేలాది మంది భక్తులు, యువతీ యువకులు ప్రత్యేక డ్రెస్కోడ్తో హాజరై ఆధ్యాత్మిక నృత్యం చేశారు. – కరీంనగర్ కల్చరల్
ఆలయ ఆవరణలో
దాండియా సందడి


