బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాల్లో.. రామనేసిరామ ఉయ్యాలో అంటూ ఊరూవాడా మార్మోగింది. చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుడి ముద్దుల గుమ్మ అంటూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా అధికారులు, ఉద్యోగులు ఆడిపాడారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్(బావుపేట), ఖాజీపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, రాఘవాపూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం సద్దులు వైభవంగా జరుపుకున్నారు. రంగురంగు పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట పెట్టి ఆడిపాడారు. మళ్లీ రావమ్మా బొడ్డెమ్మ అంటూ చెరువులో నిమజ్జనం చేశారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో న్యాయమూర్తులు నీరజ, ప్రీతి, సిబ్బంది, లాయర్లు ఆడిపాడారు. ఐడీవోసీలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు.బల్దియా వేడుకల్లో మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
– కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌రూరల్/
కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌క్రైం
కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఉద్యోగినులు
బొమ్మకల్‌లో బతుకమ్మలతో మహిళలు, యువతులు


