రైతులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛారథం’ సమన్వయంతో ఆరోగ్య ఆహార వ్యవస్థలు పత్తి మార్కెట్‌కు 5రోజులు సెలవు

చొప్పదండి: రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌ సూచించారు. చొప్పదండి ప్యాక్స్‌ సమావేశ మందిరంలో శుక్రవారం రైతులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయసేవా సంస్థ ద్వారా రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నామన్నారు. ప్యాక్స్‌ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నం మనోహర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వడ్లూరి సరిత, అధికారులు వేణుగోపాల్‌ రావు, ఛత్రునాయక్‌, ప్రియదర్శిని, రాజ్‌ కుమార్‌, తిరుపతిరెడ్డి, అంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌టౌన్‌: వెట్టిచాకిరీ నిర్మూలనపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు కార్మికశాఖ, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ (ఐజేఎం) సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ‘స్వేచ్ఛారథం’ కార్యక్రమం గురువారం కరీంనగర్‌లో ప్రారంభమైంది. ఐడీవోసీ ఆవరణలో అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్‌, పోస్టర్లను ఆవిష్కరించారు. అధికారులు, కార్మిక సంఘాల నాయకులు వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తర్వాత అవగాహన జీపును జెండా ఊపి ప్రారంభించారు. ‘మీ పని.. మీ జీతం.. మీ స్వేచ్ఛ’ నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కార్మికులకు అవగాహన కల్పించనున్నారు. జీతాలు చెల్లించకపోవడం, అప్పుల పేరుతో బలవంతంగా పనిచేయించడం, వ్యక్తిగత పత్రాలు, వస్తువులు తిరిగి ఇవ్వకుంటే 080–69434343 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి సాయం పొందవచ్చని తెలిపారు.

కరీంనగర్‌ సిటీ: ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిపుచ్చుకోవడం జీవ వైవిధ్యం, ఆహార భద్రత, ప్రజారోగ్య సమన్వయం అనే ప్రధాన అంశంపై శుక్రవారం జాతీయస్థాయి వెబినార్‌ నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి దర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్ర అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ పి.రవిరాజ్‌ పాల్గొని పుప్పొడి రేణువుల వర్గీకరణ, వాయుమండల జీవశాస్త్రం, తేనెటీగల పుప్పొడి అధ్యయనాలు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కల్వకుంట్ల రామకృష్ణ, వృక్షశాస్త్ర విభాగాధిపతి తిరుకోవెల శ్రీనివాస్‌, పడాల తిరుపతి, రౌతు రాధాకృష్ణ, తహేర్‌ హుస్సేన్‌, కళాజ్యోతి, అందె బుంగ తిరుపతి, తాజుద్దీన్‌, స్వరూపరాణి పాల్గొన్నారు.

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు శని,ఆదివారాలు సాధారణ, సోమ,మంగళ,బుధవారాలు సద్దుల బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు 172 వాహనాల్లో 997 క్వింటాళ్ల పత్తిని రైతుల అమ్మకానికి తెచ్చారు. గరిష్ట ధర రూ.9,100, మోడల్‌ ధర రూ.8,900, కనిష్ట ధర రూ.8,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement