● ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
జమ్మికుంట: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి గుండా, సైకో మాదిరిగా వ్యవహరిస్తున్నాడని, అయన తీరుపై ఎథిక్స్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, హుజూరాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం రాత్రి జమ్మికుంటకు వచ్చిన వెంకట్ మాట్లాడుతూ.. కౌశిక్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని సెంటిమెంట్‌తో గెలిచాడన్నారు. ఎమ్మెల్యే అయిన తరువాత సైకోలా వ్యవహరిస్తున్నాడని, పద్ధతి మార్చుకోకపోతే నియోజకవర్గంలో ఏ గ్రామంలో తిరుగనివ్వమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటే కావాలనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు తానే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఎండీ.సలీంపాషా పాల్గొన్నారు.


