మానకొండూర్: మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామంలో సాగునీరు లేక వరి పొలాలు ఎండుతున్నాయి. వర్షాలు కురుస్తాయని, కాలువల ద్వారా నీరు అందుతుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. వేగురుపల్లి గ్రామానికి చెందిన ఇట్టవేని సంపత్ తనకున్న మూడు ఎకరాల్లో వరి వేశాడు. వ్యవసాయబావి, కెనాల్ ద్వారా నీరు అందించేవాడు. కాలువ పారక బావి ఎత్తిపోయింది. దీంతో మూడు ఎకరాల్లో ఇప్పటికే ఎకరం ఎండిపోయిందని సంపత్ కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన దాసరి సునీల్ పొలం సైతం నీరందక ఎండిపోయింది.


