నేడు సద్దులు | - | Sakshi
Sakshi News home page

నేడు సద్దులు

Oct 18 2026 1:42 AM | Updated on Oct 18 2026 1:42 AM

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 నేడు సద్దులు టోల్‌ప్లాజా వద్ద పండుగ రద్దీ తాగునీటికే ప్రాధాన్యం ఖిల్లాది ఘనమైన చరిత్ర ఎంపీ చొరవతో..

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
కరెన్సీ‘లక్ష్మీ’

తిమ్మాపూర్‌: తిమ్మాపూర్‌ మండలం రేణికుంట టోల్‌ప్లాజా వద్ద పండుగ రద్దీ నెలకొంది. శనివారం రాత్రి కరీంనగర్‌– హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు కిక్కిరిశాయి. టోల్‌ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

కరీంనగర్‌ కల్చరల్‌: మహాశక్తి ఆలయంలో మహాలక్ష్మీ దేవిని శనివారం కాళరాత్రి అవతారంలో కరెన్సీనోట్లతో అలంకరించారు. అమ్మవారి నిజపాద దర్శనం ఆకట్టుకుంది. జిల్లా జడ్జి ఎస్‌.శివకుమార్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. నగర మహిళా కార్పొరేటర్లు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వారిని సత్కరించారు. గర్రెపల్లి మహేశ్వర శర్మ ‘భాగవత వైభవం’పై ప్రవచనం చేశారు. రాత్రి యువత దాండియా ఆటలతో సందడి చేశారు.

బతుకమ్మ పూలు, కొనుగోలుదారులతో కిక్కిరిసిన కరీంనగర్‌ ప్రధాన కూరగాయల మార్కెట్‌

కరీంనగర్‌ కల్చరల్‌: తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అసలైన సంబరానికి అంతా సిద్ధమైంది. ఎంగిలిపూలతో ప్రారంభమైన వేడుకలు ఎనిమిది రోజులు వైభవంగా సాగగా.. నేడు (ఆదివారం) సద్దుల బతుకమ్మతో గౌరమ్మను ఘనంగా సాగనంపనున్నారు. వివిధ రకాల పూలు తీసుకొచ్చి పెద్ద బతుకమ్మను పేర్చి గౌరమ్మను మొక్కుతారు. పెద్దబతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను పేర్చి తల్లీబిడ్డలుగా భావిస్తారు. ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి ఆడిపాడతారు. నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం కరీంనగర్‌లోని ప్రధాన మార్కెట్‌ పూల సింగిడి పరుచుకుంది. బంతి, చామంతి, గునుగు, తంగేడు పూలతో కళకళలాడింది. అర్ధరాత్రి వరకు ప్రజలు పూలను కొనుగోలు చేయగా.. సీతమ్మజడ పూలు మార్కెట్‌ను ముంచెత్తాయి. ధరలు ఆశాజనకంగా ఉండి.. గిరాకీ కూడా బాగుందని వ్యాపారులు తెలిపారు.

కరీంనగర్‌అర్బన్‌: ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి బెనాహుర్‌ మహేశ్‌ దత్‌ ఎక్కా ఆదేశించారు. శనివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు గరిమా అగర్వాల్‌, చిత్రా మిశ్రా, కోయ శ్రీహర్ష, బి.సత్యప్రసాద్‌తో సమీక్ష నిర్వహించారు. వరికాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ఆదేశించారు. రాబోయే నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని, విద్యుత్‌ లభ్యత పరిమితంగా ఉందన్నారు. కరీంనగర్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ దిగువ మానేరులో 15.452 టీఎంసీల నీరు ఉందని, సుమారు 512 నుంచి 593 రోజుల వరకు నీటి సరఫరాకు అవకాశం ఉందన్నారు. జగిత్యాల కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 10 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రారంభమైనందున ప్రస్తుత పంటలకు సాగునీటి ఇబ్బంది లేదన్నారు. పెద్దపల్లి కలెక్టర్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో డ్రైస్పెల్స్‌ నమోదు కాకపోవడంతో జిల్లాలో కరువు పరిస్థితులు లేవన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణం కన్నా 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, మధ్య మానేరు జలాశయంలో 23.42 టీఎంసీలు, అప్పర్‌ మానేరులో 1.84, అన్నపూర్ణ జలాశయంలో 1.59, మల్కాపేట జలాశయంలో 1.24 టీఎంసీల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రఫు ల్‌ దేశాయ్‌, అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మహేశ్‌ దత్‌ ఎక్కా

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చారిత్రక రామగిరి ఖిల్లాకు రోప్‌వే రానుంది. పర్వతమాల పరియోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు టెండర్‌ అప్పగించేందుకు సిద్ధమైంది. మొత్తం 2.1 కిలోమీటర్ల దూరం మేరకు నిర్మించనున్న ఈ రోప్‌వే కోసం రూ.5.23 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం ఐదు చోట్ల రోప్‌వే ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో నాగార్జున సాగర్‌ పరిధిలోని నాగార్జున కొండ (చారిత్రక బౌద్ధ క్షేత్రం), యాదగిరి గుట్ట (యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం), రామగిరి ఖిల్లా (పెద్దపల్లి జిల్లా), హనుమాన్‌ హిల్‌ (నల్లగొండ జిల్లా), డిచ్‌పల్లి (నిజామాబాద్‌) ఉన్నాయి. ఈ ఐదు చోట్ల రోప్‌వేలకు కేంద్రం రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది. ఈ ఐదింట్లో మొట్టమొదటిసారిగా హర్యానాకు చెందిన సివిల్‌ మంత్రా ఇన్‌ఫ్రాకాన్‌ లిమిటెడ్‌ అనే పేరు గల సంస్థకు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేషనల్‌ హైవేస్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సదరు కాంట్రాక్టు సంస్థ బిడ్‌ను సెప్టెంబరులోనే అధికారికంగా ఆమోదించినట్లు తెలిసింది. మిగిలిన రోప్‌వేలకు ప్రస్తుతం డీపీఆర్‌ పనులు సాగుతున్నాయి. అవి పూర్తయిన అనంతరం పనులు మొదలవుతాయి.

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా ప్రకృతి అందాలకు, అద్భుత శిల్పకళకు నెలవు. పెద్దపల్లి నుంచి 18కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ రోప్‌వే నిర్మించడం వల్ల పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. రామగిరి కోటకు ఘనమైన చరిత్ర ఉంది. త్రేతా యుగంలో రాముడు అయోధ్య నుంచి లంకకు వెళ్లేటప్పుడు ఇక్కడ సేద తీరాడని రామాయణ ఇతిహాసంలో ఉంది. ప్రాచీన సంస్కృత కవి కాళిదాసు మేఘసందేశంలో రామగిరి ఖిల్లా గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఐటీపరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఖిల్లా చుట్టూ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు. రామగిరి, ముత్తారం మీదుగా వరంగల్‌కు ఎన్‌హెచ్‌ 63 (నాగపూర్‌ నుంచి విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌) వేస్తున్నారు. పెద్దపల్లి నుంచి కునారం మీదుగా ముత్తారం నుంచి భూపాలపల్లికి మరో రాష్ట్ర రహదారికి ప్రతిపాదన ఉంది. ప్రధాన మంత్రి సడక్‌ యోజన కింద అమ్రాబాద్‌ నుంచి ముత్తారం మండలం పారుపల్లి వరకు రోడ్డు నిర్మాణం మొదలైంది. ఈ రోడ్డులో ముత్తారం మండలంలో రెండు వంతెనలు నిర్మిస్తున్నారు. ఒక్కో బ్రిడ్జికి రూ.2.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగిరి ఖిల్లాపైకి రోప్‌వే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరిని పలుమార్లు కోరారు. ఖిల్లా చరిత్ర, శిల్పకళ, ప్రకతి అందాల గురించి ఒక రిపోర్ట్‌ తయారు చేసి నివేదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నది జరిగితే రామగిరి మండలంతో పాటు పెద్దపల్లి, మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్‌ మండలాలు అభివృద్ధి చెందుతాయి. పెద్దపల్లి జిల్లాలో రవాణా, టూరిజం ద్వారా వ్యాపార పరంగా అభివృద్ధి జరగనుంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ దండిగా ఉన్న రామగిరి ఖిల్లా ప్రాంతానికి రోప్‌ వే మంజూరుకావడంపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement